Site icon HashtagU Telugu

KL Rahul-Athiya: లగ్జరీ ఫ్లాట్ లోకి ‘లవ్ బర్డ్స్’

Rahul

Rahul

స్టార్ క్రికెటర్ కె.ఎల్.రాహుల్ , బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కుమార్తె ఆతిథ్య శెట్టి ముంబైలోని ఒక విలాసవంతమైన ఒక ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు.. త్వరలోనే ఈ ఫ్లాట్ లో దిగుతారని తెలుస్తోంది. బాంద్రాలోని కార్టర్ రోడ్ లో ఉన్న ఈ ఫ్లాట్ అద్దె..నెలకు రూ.10 లక్షలట!! ఇందులో 4 బెడ్ రూమ్ లు ఉంటాయట!! సముద్రానికి ఎదురుగా ఆహ్లాదకర వాతావరణం లో ఇది ఉంటుంది. కె.ఎల్. రాహుల్ , ఆతిథ్యల ప్రేమ వ్యవహారం గురించి ఇటీవల సునీల్ శెట్టిని మీడియా ప్రశ్నించగా.. “వారి ప్రేమ విషయం లో నాకు, నా భార్య కు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు” అని స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, సెల్ఫీలతో కె.ఎల్.రాహుల్ , ఆతిథ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక సందడి చేస్తుంటారు. ఒకరికొకరు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు.

Exit mobile version