TDP: ప్ర‌త్యేక హోదా విష‌యంలో జగన్ రెడ్డికి ‘మోసకార్’ అవార్డు ఇవ్వాలి – అచ్చెన్నాయుడు

ప్రత్వేక హోదాపై ఆస్కార్ అవార్డుకు మించి‎ నటించిన ‎జగన్ రెడ్డికి 'మోసకార్' అవార్డు ఇవ్వాలన్నారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు.

  • Written By:
  • Publish Date - February 13, 2022 / 01:01 PM IST

ప్రత్వేక హోదాపై ఆస్కార్ అవార్డుకు మించి‎ నటించిన ‎జగన్ రెడ్డికి ‘మోసకార్’ అవార్డు ఇవ్వాలన్నారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు. ప్రతిపక్షంలో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి హోదా కోసం ఆరోజు ప్రాణాలు అర్పిస్తామని చెప్పిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. జగన్ లాంటి నటుణ్ని ప్రజలు ఇంతవరకు చూసి ఉండరని..ఇక‌పై చూడబోరంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదాపై వైసీపీ లోపాయికారితనం, చేతకానితనం ‎మరోసారి రాష్ట్ర ప్రజలకు బహిర్గతమైందిని.. విభజన సమస్యల‎ పరిష్కారానికి నియమించిన సబ్ కమిటీ ఎజెండాలో తొలుత ప్రత్యేక హోదా చేర్చి మళ్లీ తొలగించడమేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జగన్ రెడ్డి తన కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టార‌ని.. నాడు అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తా, ఉద్యోగాలిస్తా అని ప్రగల్భాలు పలికి నేడు ఎందుకు చేతులెత్తేశారని ప్ర‌శ్నించారు. జగన్ తన స్వార్థం కోసం ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను అమ్మేశారనిఅచ్చెన్నాయుడు ఆరోపించారు.

హోదా అనే పదాన్ని రాష్ట్రంలో బ్యాన్ చేశారని… యువ భేరీల పేరుతో ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన జగన్ నేడు క్షమాపణ సదస్సులు నిర్వహించి విద్యార్థి, యువతకు క్షమాపణలు చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనపుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, వైసీపీ ఎంపీలకు ఒక్క క్షణ కూడా లేదన్నారు.‎ వెంటనే రాజీనామా చేయాలని… నాడు టీడీపీ ఎన్డీయేతో కలిసి ఉన్నప్పటికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ‎తృణప్రాయంగా పదవులను వదులుకున్నాం తప్ప మీలాగ స్వార్థం కోసం పదవులను పట్టుకొని వేలాడలేదని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ఎంపీలు జగన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాల‌ని… హోదాను తాకట్టు పెట్టిన జగన్ రెడ్డి ఇప్పటికే చరిత్ర హీనులుగా మిగిలిపోయార‌న్నారు. మీరు కూడా చరిత్ర హీనులుగా కాకుండా ఉండాలంటే జగన్ మాట పక్కనపెట్టి రాజీనామాలు చేయాల‌ని హిత‌వు ప‌లికారు.