Site icon HashtagU Telugu

Blast in Bhupalpally Plant: భూపాల‌ప‌ల్లి కేటీపీపీలో పేలుడు.. ఏడుగురికి తీవ్రగాయాలు..!!

blast

blast

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ లో సోమవారం నాడు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 500మెగావాట్ల పవర్ ప్లాంట్ లో ఈ పేలుడు జరిగింది. జిల్లాలోని ఘణపురం మండలం చేల్పూరులో గట ఎన్టీపీసీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోల్ పంపించే మిల్లులో ఒక్కసారిగా ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు కారణంగా ప్లాంట్ లో పెద్దెత్తున మంటలు చెలరేగాయి. ఓ వైపు మంటలను అదుపుచేసే పనిని చేపట్టిన అధికారులు…మరోపక్క గాయపడినవారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిస్తున్నారు. సోమవారం కిషర్ రెడ్డి కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు. అధికారులతో సమీక్షించారు. సాయంత్రానికి ఈ ప్లాంట్లో ప్రమాదం చోటుచేసుకుంది.

Pic Courtesy: LaxmaReddy/Twitter