Site icon HashtagU Telugu

Sabarimala: దారుణం.. లోయలో పడిన బస్సు.. గాయపడిన 62 మంది అయ్యప్ప స్వామి భక్తులు?

Sabarimala

Sabarimala

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన కూడా వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వాహన ప్రమాదాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వాహన ప్రమాదాల కారణంగా నిత్యం పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే వందల సంఖ్యలో వాహన ప్రమాదాలు వల్ల గాయాల పాలవుతున్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ఈ వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో మరణిస్తున్నారు.

అయితే ప్రభుత్వం వాహన ప్రమాదాలను అరికట్టడానికి ఎన్నో రకాల చట్టాలను ట్రాఫిక్ నిబంధనలను అమల్లోకి తీసుకు వచ్చినప్పటికీ ఏదో ఒక విధంగా ప్రమాదాలు ఉన్నాయి. అయితే వాహన ప్రమాదాలు జరగడానికి నిర్లక్ష్యం అలాగే అతివేగం ఇవి రెండు ఎక్కువగా కారణమవుతున్నాయి.. ఇలా ఉంటే తాజాగా కూడా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడడంతో దాదాపుగా 62 మందికి పైగా అయ్యప్ప స్వామి భక్తులు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళ లోని పతనంథిట్ట జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపుగా 62మందికి పైగా భక్తులు గాయపడ్డారు. అయితే వారందరూ కూడా తమిళనాడు లోని మయిలాదుతురై జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు.

శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకొని అనంతరం భక్తులతో వస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలోకి జారిపడింది. మధ్యాహ్నం 1.30 గంట సమయంలో నిలక్కల్ సమీపంలోని ఎలావుంకల్‌ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ప్రమాదం సమయంలో బస్సులో తొమ్మిది మంది చిన్నారులతో పాటు 64 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో 62మందికి గాయాలు కాగా వీరిలో కొందరికి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా పరిస్థితి విషమంగా ఉన్న వారిని సమీపంలోని మంచి ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version