Site icon HashtagU Telugu

Oakland Gun Fire : ఓక్లాండ్‌లోని పాఠశాలలో కాల్పుల క‌ల‌క‌లం.. ఆరుగురికి గాయాలు

Gun

Gun

ఓక్లాండ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. గాయ‌ప‌డిన ఆరుగురిని ఆసుప్ర‌తికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. ఓక్లాండ్ మేయర్ లిబ్బి షాఫ్, క్షతగాత్రులందరూ పెద్దవాళ్లని, మరో మూడు పాఠశాలలు ఉన్న అదే బ్లాక్‌లో ఉన్న ప్రత్యామ్నాయ K-12 పాఠశాల అయిన సోజర్నర్ ట్రూత్ ఇండిపెండెంట్ స్టడీలో కాల్పులు జరిగాయని ట్వీట్ చేశారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఓక్‌లాండ్‌లోని హైలాండ్ ఆసుపత్రిలో, మిగిలిన ముగ్గురిని క్యాస్ట్రో వ్యాలీలోని ఈడెన్ మెడికల్ సెంటర్‌కు తరలించామని, వారి పరిస్థితులు తెలియరాలేదని అధికారులు తెలిపారు.