Balochistan Blast: 52 కు చేరిన బలూచిస్థాన్ మృతుల సంఖ్య

పాకిస్థాన్‌లో జరిగిన బాంబు దాడిలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఈ రోజు పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 50 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు.

Balochistan Blast: పాకిస్థాన్‌లో జరిగిన బాంబు దాడిలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఈ రోజు పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెప్తున్నారు. ఈద్ మిలాద్-ఉన్-నబీని పురస్కరించుకుని ఊరేగింపు కోసం ప్రజలు గుమిగూడారు. ఈ క్రమంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారితో సహా కనీసం 52 మంది మరణించారు. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు సమీపంలో చోటుచేసుకుంది.మృతుల సంఖ్యను జిల్లా ఆరోగ్య అధికారి (డిహెచ్‌ఓ) అబ్దుల్ రజాక్ షాహి తెలిపారు. మరణించిన వారిలో పోలీసు అధికారి కూడా ఉన్నారని సిటీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహ్మద్ జావేద్ లెహ్రీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని కరాచీకి తరలించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కరాచీలోని ఆసుపత్రులను ఆరోగ్య శాఖ తరపున సంప్రదిస్తున్నామని, గాయపడిన వారి చికిత్స కోసం అన్ని ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది అని ఆయన అన్నారు.

Also Read: Pedakapu 1 Review : పెదకాపు-1 : రివ్యూ