Afghanistan Explosion: అఫ్ఘానిస్తాన్‌లో వరుస పేలుళ్లు.. 14 మంది దుర్మరణం!!

వరుస పేలుళ్లతో అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. కాబూల్ నగరంలోని మజార్-ఇ-షరీఫ్ లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి.

Published By: HashtagU Telugu Desk
Afghan explosion

Afghan explosion

వరుస పేలుళ్లతో అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. కాబూల్ నగరంలోని మజార్-ఇ-షరీఫ్ లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. బుధవారం జరిగిన నాలుగు పేలుళ్లలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాలిబన్ పాలనను వ్యతిరేకిస్తున్న ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ వరుస బాంబుదాడులకు పాల్పుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ డిస్ట్రిక్ట్ 4లో బుధవారం సాయంత్రం ప్రార్థనల సమయంలో మసీదులో పేలుడు సంభవించిన ఘటనలో ఐదుగురు మరణించగా…మరో 17మంది గాయపడ్డారు.

హజ్రత్ -ఎ-జెక్రియా మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు జిన్హువా వార్త సంస్థ తెలిపింది. మజార్ -ఇ-షరీఫ్ లోని పీడి 10, పిడి 5లో మూడు వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. మూడు వ్యాన్లు బస్సులను ఢీకొన్నఒక గంట తర్వాత ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల ఘటనలో మరో 9మంది మరణించగా…15మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ వరుస బాంబుదాడుకలు పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటికి ఏ ఉగ్రవాద గ్రూపు ప్రకటించలేదు.

  Last Updated: 26 May 2022, 10:01 AM IST