Site icon HashtagU Telugu

Vaishno Devi: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట 12 మంది మృతి

Fh E0hxveamxj6l Imresizer

Fh E0hxveamxj6l Imresizer

జమ్మూ కశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం కావడంతో వైష్ణోదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 12 మంది భక్తులు మృతి చెందినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 50 మందివరకు గాయపడి ఉంటారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గాయపడిన వారిని సమీపంలోని నరైనా ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాటకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని అధికారులు చెప్తున్నారు. దీంతో చాలా మంది భక్తులు దర్శనం చేసుకోకుండా వెళ్లిపోయారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. సహాయకచర్యలు వేగం పెంచాలని తెలిపారు. తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్న మోదీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.