Site icon HashtagU Telugu

Snapchat:ఫేస్ బుక్, ట్విట్టర్ ల కంటే వేగంగా స్నాప్ చాట్ వృద్ధి

Snapchat Imresizer

Snapchat Imresizer

సోషల్ మీడియాలో స్నాప్ చాట్ దుమ్ములేపుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ ల కంటే వేగంగా వృద్ధి చెందుతోంది. ‘ స్నాప్ చాట్ ‘ డైలీ యాక్టివ్ వినియోగదారుల సంఖ్య 18 శాతం పెరిగి 33.2 కోట్లకు ఎగబాకింది. స్నాప్ చాట్ వినియోగదారుల సంఖ్య పెరగడటంతో దాని రాబడి (రెవెన్యూ) కూడా 38 శాతం పెరిగి రూ.8,100 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది స్నాప్ చాట్ వినియోగదారులు ప్రతిరోజు ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఫీచర్స్ ను వాడుతున్నారని కంపెనీ తెలిపింది.

క్రియేటివ్ టూల్స్ , లెన్స్ తో స్పాట్ లైట్ సబ్ మిషన్స్ 350 శాతం పెరిగాయని పేర్కొంది. జనవరి – మార్చి త్రైమాసిక నివేదికలో ఈ వివరాలను స్నాప్ చాట్ వెల్లడించింది. ఇక ఇదే కాలంలో ఫేస్ బుక్ (మెటా) డైలీ యాక్టివ్ వినియోగదారుల సంఖ్య తొలిసారిగా పడిపోయింది. మరోవైపు ట్విటర్ కు ఆయువు పట్టుగా ఉన్న అమెరికాలో డైలీ యాక్టివ్ వినియోగదారుల సంఖ్య 2 శాతమే పెరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా15 శాతం వినియోగదారుల పెరుగుదలను ట్విటర్ సాధించగలిగింది.

Exit mobile version