Site icon HashtagU Telugu

Telangana: రేపటి నుంచి శాసనసభ సమావేశాలు, 15న గవర్నర్ ప్రసంగం

Ts Assembly

Ts Assembly

Telangana: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 14 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. బుధవారం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. శాసనసభాపతిగా కాంగ్రెస్‌ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ను ఎన్నుకోవాలని ఆ పార్టీ ఇప్పటికే తీర్మానించింది. ఆయన ఒక్కరే నామినేషన్‌ వేస్తే.. ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ఇంకెవరైనా వేస్తే ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది.

సమావేశాలు ఎన్ని రోజులనేది బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. 15న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. 16న శాసనసభలో, మండలిలో విడివిడిగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. అయితే మొదటి సమావేశంలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయలేదు. రేపు జరుగబోయే సమావేశంలో ప్రమాణం చేసే అవకాశాలున్నాయి.