దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపధ్యంలో , ఈరోజు గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో నేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో పూర్తవుతాయి. ఇక ఇప్పటికే ఉత్తర్ ప్రదశ్‌లో తొలి దశ ఎన్నికలు పూర్తియిన సంగతి తెలిసిందే. ఈరోజు యూపీలో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ఇప్పటికే మోదలైంది. ఎన్నికల అధికారులు కోవిడ్ రూల్స్ పాటిస్తూ పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో మంచు కురుస్తుండడంతో, ఆ రాష్ట్రంలో పోలింగ్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశముంది. ఈ క్రమంలో ఇంకా అక్కడి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకోలేదు.
మరోవైపు గోవాలో నలభై నియోజకవర్గాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గోవాలో నేడు జరుగుతున్న ఎన్నికల నేపధ్యంలో మొత్తం 301 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని సమాచారం. గోవాలో మహిళా ఓటర్ల కోసం, అక్కడి ఎన్నికల అధికారులు, వారి కోసం ప్రత్యేకంగా 105 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో మొత్తం 11 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారి గోవాలో పోటీ అనేక పార్టీల మధ్య ఉంది. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ, శివసేన, టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల బరిలో దిగనున్నాయి. మరి గోవా ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.