Site icon HashtagU Telugu

Lady Singham:కాబోయే భర్తను అరెస్టు చేసిన పోలీసు అధికారిణి..!!

Assam Lady Cop

Assam Lady Cop

బంధాల కంటే…పోలీసు అధికారిగా తన అధికారమే ముఖ్యం అనుకుంది. విధి నిర్వహణకే అధిక ప్రాధాన్యమిచ్చింది. ఆ పోలీసుల అధికారిణి కాబోయే భర్త మోసగాడని తెలియడంతో అరెస్టు చేసింది. అసోంకు చెందిన జున్మోనీ రభా నాగావ్ లో ఆమె పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా విధుల నిర్వర్తిస్తున్నారు. గత అక్టోబర్ లో రాణా పోగాగ్ అనే వ్యక్తి నిశ్చితార్థం జరిగింది. వారి పెళ్లి ఈ ఏడాది నవంబర్ లో జరగాల్సి ఉండగా…రాణా పోగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా ఆ మహిళా ఎస్సైకి పరిచయం చేసుకున్నాడు. తర్వాత అతన ఓ ఘరానా మోసగాడని తేలింది.

తాను ఓఎన్జీసీలో పనిచేస్తున్నట్లుగా..తనకు డబ్బులు ముట్టచెబితే ఓఎన్జీసీలో ఉద్యోగాలు కల్పిస్తానని పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. కోట్లాది రూపాయలు వసూలు చేసిన విషయం బయటపడింది.

బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న ఎస్సై జన్మోనీ రభా…తనకు కాబోయే భర్త రాణా పోగాగ్ ను అరెస్టు చేసింది. దీంతో బాధితులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. వైవాహిక జీవితంలో తాను మోసపోకుండా కాపాడినందుకు ఆమె కొనియాడారు.

Exit mobile version