Assam CM: కేసీఆర్’ కు అసోం సీఎం దిమ్మతిరిగే కౌంటర్

సోనియా గాంధీ ముద్దుల తనయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Cm Kcr

Cm Kcr

సోనియా గాంధీ ముద్దుల తనయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. రాహుల్ గాంధీని… రాజీవ్ గాంధీ కుమారుడే అని చెప్పడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా రుజువులు అడిగిందా..? అని హిమంత బిస్వశర్మ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంత దిగజారి మాట్లాడతారా? అని ఆయన ప్రశ్నించారు. హిమంతను సీఎం పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ నానమ్మ ఇందిర, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని… రాహుల్ తాత నెహ్రూ ప్రధానిగా పని చేశారని… అలాంటి కుటుంబం గురించి ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇదేనా బీజేపీ మాట్లాడే ధర్మం, హిందుత్వం అని గులాబీ దళపతి కేసీఆర్ ప్రశ్నించారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ కౌంటర్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రయిక్స్ పై రాహుల్ గాంధీ ఆధారాలు అడిగారని… సీడీఎస్ బిపిన్ రావత్ మరణంపై వ్యాఖ్యలు చేశారని… అలాంటి వ్యక్తి గురించి తాము మాట్లాడకూడదా…? ఆయన ప్రశ్నించారు. గాంధీ కుటుంబంపై విమర్శలు చేయకూడదా…? అని అడిగారు బిస్వశర్మ. కేసీఆర్ కు కేవలం తాను మాట్లాడిందే తప్పుగా అనిపించిందా…? అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ను సూటిగా ప్రశ్నించారు అసోం సీఎం హిమంత బిస్వశర్మ. మరి అసోం సీఎం కు కౌంటర్ గా టీఆర్ఎస్ నుంచి మళ్లీ ఎవరు రంగంలోకి దిగుతారో అన్నది వేచి చూడాలి.

  Last Updated: 13 Feb 2022, 01:16 PM IST