Site icon HashtagU Telugu

Gold Medal In Archery: కాంపౌండ్ ఆర్చరీలో భారత్ కు గోల్డ్ మెడల్.. రికార్డు సృష్టించిన భారత్..!

India Medal History

Compressjpeg.online 1280x720 Image 11zon

Gold Medal In Archery: ఆర్చరీలో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఓజాస్ డియోటాలె, జ్యోతి వెన్నం స్వర్ణ పతకాన్ని (Gold Medal In Archery) గెలుచుకున్నారు. భారత జోడీ దక్షిణ కొరియా జట్టును ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. వారు 159–158తో దక్షిణ కొరియాను ఓడించారు. అంతకుముందు ఆర్చరీలో ఓజాస్ డియోటాలే, జ్యోతి వెన్నం కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కజకిస్థాన్ జట్టును ఓడించి ఫైనల్స్ కు చేరుకున్నారు. జ్యోతి, ఓజాస్ 159-154తో కజకిస్థాన్ ఆర్చర్లను ఓడించారు.

అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఈరోజు తొలి పతకం లభించింది. మిక్స్‌డ్ 35 కి.మీ రేసులో మంజు రాణి, రామ్‌బాబు జంట కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. చైనాకు బంగారు పతకం, జపాన్‌కు కాంస్య పతకం లభించాయి. ఈ పతకంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 71కి చేరుకోగా, ఆసియా క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసింది. 2018లో భారత్ 16 స్వర్ణాలు సహా 70 పతకాలు సాధించింది. ఈసారి కూడా భారత్ 16 స్వర్ణాలు సహా 71 పతకాలు సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి భారత్ 100 పతకాలు సాధిస్తుందన్న ఆశాభావం నెలకొంది.

Also Read: India Warm-Up Matches: వర్షం కారణంగా బంతి పడకుండానే భారత్ వార్మప్ మ్యాచ్ లు రద్దు..!

We’re now on WhatsApp. Click to Join

భారత్ రికార్డు

2023లో చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. 2023 ఆసియా క్రీడల 11వ రోజున రెండు పతకాలు సాధించడం ద్వారా ఆసియా గేమ్స్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పతకాలు సాధించిన భారత్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. 2023 ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇప్పుడు 71 పతకాలు వచ్చాయి. ఆసియా క్రీడల ఎడిషన్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు ఆసియా గేమ్స్‌లో భారత్‌ ఒకే ఎడిషన్‌లో అత్యధికంగా 70 పతకాలు సాధించింది. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ ఈ రికార్డును నమోదు చేసింది. అప్పుడు భారత్ 16 స్వర్ణాలు, 13 రజతాలు, 31 కాంస్య పతకాలు సాధించింది.

2023 ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు సాధించింది. 11వ రోజు ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఓజాస్‌ డియోటాలే, జ్యోతి వెన్నం బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ఆసియా గేమ్స్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పతకాలు సాధించిన భారత్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది.