Vishwak Sen: అభిమానులు లేకపోతే నేను లేను!

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’.

  • Written By:
  • Publish Date - May 4, 2022 / 11:27 PM IST

‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్‌. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో విద్యాసాగ‌ర్ చింతా ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రాజాగారు రాణివారు’ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు కథ, మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం. మే 6న సినిమా భారీ లెవల్లో విడుదలవుతుంది. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమంలో

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘అశోకవనంలో అర్జున్ కళ్యాణం’ సినిమా బావుంది. పాటలు బావున్నాయి అని మాట్లాడటం కంటే ఇప్పుడు నేను అర్జున్ అల్లంగాడి గురించి మాట్లాడతా. వాడికి కాస్త భయం ఎక్కువ.. ఇన్ సెక్యూరిటీగా ఫీలవుతుంటాడు.. మనందరిలానే.. పాతికేళ్లు రాగానే చదువు.. ముప్పై ఏళ్లు రాగానే సెటిల్ అవ్వాలి.. పెళ్లి చేసుకోవాలి.. ఇలాంటి ఇన్‌సెక్యూరిటీస్‌తోనే ఉంటాం.. 35 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంటే తప్పా? జైల్లో వేస్తారా? ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే కూడా తప్పుగానే చూస్తారు. మనం మన గర్ల్ ఫ్రెండ్స్‌‌ని సమంత, ఐశ్వర్యా రాయ్‌లతో పోల్చితే.. వాళ్లు మనల్ని ఎలా ఉండాలని అనుకుంటున్నారో అని భయపడాల్సి వస్తుంది.. అమ్మాయిలకు కూడా చెబుతున్నా.. మీరు మీ ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్‌‌తో కంపేర్ చేయొద్దు.. అలా చేస్తూ కలిసి ఉన్నారంటే.. మీరు సగం చచ్చినట్టే.

మన ఇంటికి చుట్టాలు వస్తారు.. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతారు.. ఆ తరువాత ఇంట్లో పెద్ద చర్చే జరుగుతుంది.. మన అందరం కూడా ఈ భయాలతో బతుకుతాం.. అలా బతకొద్దు.. ఇవన్నీ రిలేటబుల్ అయినోడే అర్జున్ అల్లం.. 33 ఏళ్లు ఇలానే బతుకుతాడు.. వాటి నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకుని ఎలా ఉన్నాడనేది ఈ కథ.. నన్ను బాగా చూసుకున్న నిర్మాత సుధీర్‌కు థ్యాంక్స్. వంద రూపాయలుంటే ఇవ్వండి.. అడ్వాన్స్ తీసుకుంటాను.. నెక్ట్స్ కూడా మీతోనే సినిమా తీయాలని ఉంది.. మీరు స్వీట్ హార్ట్ పర్సన్.. బీవీఎస్ఎన్ గారి ప్రజెంట్‌లో సినిమా రావడం నా అదృష్టం. సాగర్ నా ఫ్రెండ్.. కలిసి షార్ట్ ఫిల్మ్‌లు తీశాం.. నేను ఈ కథకు సూట్ అవుతాను అని ఆయనకే అనిపించిందట.. రవికిరణ్ రాసిన రైటింగే వల్లే నేను నటించగలిగాను. జే అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. నా కెరీర్ లో ఇంత క్లాస్ మూవీ ఇదే. మళ్లీ మళ్లీ మనం పని చేయాలనుకుంటున్నాను.. పవి ఆర్ట్ వర్క్ అద్భుతంగా చేసింది. ఇంత అద్బుతమైన టీంతో ఉన్నప్పుడు.. మనం యాక్టింగ్ మీద దృష్టి ఉంటుంది.. ఇది నా కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అవుతుంది.. మీరు సినిమా చూస్తూ నవ్వుతారు.. భయపడతారు.. ఆనందం ఎక్కువై ఏడుస్తారు.. ’ అని విశ్వక్ సెన్ చెబుతుంటాడు. ఇంతలో ఓ ఫ్యాన్ స్టేజ్ మీదకు రాబోతోంటాడు. వద్దు వద్దు ఈ ట్రెండ్ బాగా పాతదైంది.. లవ్యూ రా.. వాడిని పట్టుకోండి.. అలానే ఉండండి.. వస్తానురా అక్కడికి అని అంటాడు. అనంతరం విశ్వక్ సేన్ మళ్లీ స్పీచు ప్రారంభిస్తాడు.

‘ అందరూ ఫ్యామిలీతో ఈ సినిమాను చూడండి.. నేను చేసింది నాలుగు సినిమాలే అయినా వాటి మ్యాష్ అప్ చూసి ఎమోషనల్ అయ్యాను. ఇంత వరకు నా సినిమా కష్టాల గురించి ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నా. ఎవరైనా ఇంట్లో హీరో అవుతాను అని చెబితే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కానీ నన్ను మాత్రం మా అమ్మ నమ్మింది.. ఆ తరువాత నాన్న నమ్మాడు.. ఎంతో కష్టపడి ఫిల్మ్ కోర్సులు.. నేర్చుకున్నాను. డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ నేర్చుకున్నాను. 12 లక్షలు పెట్టి వెళ్లిపోమాకే చేశాను.. నిర్మాతకు నచ్చి కొని రిలీజ్ చేశాడు. అదే పెద్ద సక్సెస్.. నా దగ్గర ఏం లేని సమయంలో తరుణ్ భాస్కర్ నన్ను పెట్టి సినిమా తీశాడు. ఆయనకు థ్యాంక్స్.ఇంత వరకు నా సినిమా కష్టాల గురించి ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నా. ఎవరైనా ఇంట్లో హీరో అవుతాను అని చెబితే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కానీ నన్ను మాత్రం మా అమ్మ నమ్మింది.. ఆ తరువాత నాన్న నమ్మాడు.. ఎంతో కష్టపడి ఫిల్మ్ కోర్సులు.. నేర్చుకున్నాను. డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ నేర్చుకున్నాను. 12 లక్షలు పెట్టి వెళ్లిపోమాకే చేశాను.. నిర్మాతకు నచ్చి కొని రిలీజ్ చేశాడు. అదే పెద్ద సక్సెస్.. నా దగ్గర ఏం లేని సమయంలో తరుణ్ భాస్కర్ నన్ను పెట్టి సినిమా తీశాడు. ఆయనకు థ్యాంక్స్.

అమ్మా నీకు ఒకటి చెబుతున్నా.. నీ కొడుక్కి ఏం కాదు.. ఎవరూ ఏమీ చేయలేరు.. నేను అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వనని అంటున్నారు.. అదే నిజమైతే.. ఆ రోజు స్టూడియోలో అలా వచ్చి ఉండేవాడిని కాదు.. నీ కొడుక్కి నువ్ నేర్పిన సంస్కారం అందరికీ తెలుసు.. నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు.. చిన్న ఈగలాంటివాడిని.. నలుగురు కలిపి కొడితే పడిపోతాను..కానీ నాకు రక్షణగా మీరున్నారు (అభిమానులు).. మీరు (ఫ్యాన్స్) పెట్టిన మెసెజ్‌లు చేశాను.. మీరే నా ఆస్తి.. నన్ను ఎవ్వరూ ఏం చేయ‌లేరు అనిపించింది.. నాకు మీరున్నారు.. డౌట్ వస్తే.. హ్యాష్ ట్యాగ్ విశ్వక్ సేన్ అని కొట్టి చూడండని చెబుతాను’.. అని ఎమోషనల్ అయ్యాడు. అనంతరం మోకాళ్ల మీద కూర్చుని అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. మీరు లేకపోతే.. మీరు లేకపోతే.. నా ప్లేస్‌లో వీక్ హార్టెడ్ పర్సన్ ఉంటే.. ఏమైనా జరిగిదే.. కానీ నేను మీరు బాధపడే పని ఏం చేయను.. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా.. ఈ ఏడాది మూడు సినిమాలు ఇస్తా.. నా కోసం నిలబడినందుకు అందరికీ థ్యాంక్స్.. నేను చెప్పుకునేది ఒకటే.. నాకు మీరు తప్పా ఎవ్వరూ లేరురా.. థ్యాంక్స్’’ అన్నారు.

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘మా అబ్బాయి బాపినీడు, సుధీర్ కలిసి స్టార్ట్ చేసిన ఎస్‌వీసీసీ డిజిట‌ల్‌లో వ‌స్తోన్న మొద‌టి చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. సినిమా బాగా వచ్చింది. అందరూ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. నిర్మాత సుధీర్ మాట్లాడుతూ ‘‘‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ వంట మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో మీ ముందుకు వ‌స్తున్నాం. ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు.

హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ ‘‘‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్ర నిర్మాత‌లు బివీఎస్ఎన్ ప్ర‌సాద్‌గారికి, బాపినీడుగారికి, సుధీర్‌గారికి ముందుగా థాంక్స్‌. అలాగే ఎంటైర్ టీమ్ నాపై న‌మ్మ‌కంతో ఎంత‌గానో ఎంక‌రేజ్ చేసింది. డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్‌గారు, ర‌వి కోలాగారు.. ఇలా యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ టీమ్‌తో క‌లిసి ప‌ని చేశాను. ఈ సినిమాలో నేను చేసిన మాధ‌వి పాత్ర నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైన సినిమా. ప్ర‌తి అమ్మాయి న‌న్ను రిలేట్ చేసుకుంటుంది. అలాగే అర్జున్ పాత్ర‌కు అబ్బాయిలు క‌నెక్ట్ అవుతారు. విశ్వ‌క్ సేన్ అమేజింగ్ యాక్ట‌ర్‌. కుటుంబాలు, బంధాల గురించి చెప్పే అంద‌మైన మెసేజ్ ఉన్న చిత్ర‌మిది’’ అన్నారు.

చిత్ర దర్శకుడు విద్యాసాగర్ చింతా మాట్లాడుతూ ‘‘మాది విజ‌య‌వాడ‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్న‌ప్ప‌టి నుంచి చాలా సినిమాలు చూశాం. కాలేజ్ బంక్ కొట్టి మ‌రీ వెళ్లేవాడిని. మా నాన్న‌గారు కూడా సినిమాల‌కు తీసుకెళ్లేవారు. బి.ఫార్మ‌సీ అయిపోయిన త‌ర్వాత ఏం చేస్తావ‌ని ఇంట్లో వాళ్లు అడిగారు అప్పుడు ఫిల్మ్ స్కూల్‌లో జాయిన్ అవుతాన‌ని అన్నాను. అప్పుడు అమ్మ కంగారు ప‌డిపోయింది. ఒప్పుకోలేదు. నాన్న‌గారిని ఒప్పిస్తాన‌ని అన్న‌య్య వెళ్ల‌మ‌న్నాడు. నాన్న‌గారు కూడా క‌న్విస్ అయ్యి నాలుగున్న‌ర ల‌క్ష‌లు తాక‌ట్టు పెట్టి ఫిల్మ్ స్కూల్‌లో జాయిన్ చేశారు. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చ‌కుంటాను. నా నిర్మాత‌ల‌కు థాంక్స్‌. అలాగే నా టీమ్‌కు థాంక్స్‌. అంద‌రూ ఎంతో బాగా వ‌ర్క్ చేశారు. విశ్వ‌క్‌గారి గురించి చెప్పాలంటే, త‌న‌ను 9 ఏళ్లుగా చూస్తున్నాను. వ్య‌క్తిగా ఆయ‌న ఎంతో బాగా ఎదిగారు. అలాగే యాక్ట‌ర్‌గా ఎంతో మెచ్యూర్డ్ ప‌ర్స‌న్‌. ఆయ‌న్ని ద‌గ్గ‌ర‌గా చూసిన వ్య‌క్తిగా చెబుతున్నాను. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.