Ashadh Amavasya 2022 : ఆషాఢ అమావాస్య ఎప్పుడు…ఆ రోజు ఈ పనిచేస్తే, లక్ష్మీ దేవి నట్టింట్లో తిష్ట వేయడం ఖాయం..

ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను ఆషాఢ అమావాస్య అంటారు. ఈ అమావాస్యను హలహరి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున మీ సమీపంలోని ఓ నదిలో స్నానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్తులు మీకు లభిస్తాయి.

  • Written By:
  • Publish Date - June 8, 2022 / 06:00 AM IST

ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను ఆషాఢ అమావాస్య అంటారు. ఈ అమావాస్యను హలహరి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున మీ సమీపంలోని ఓ నదిలో స్నానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్తులు మీకు లభిస్తాయి. అంతే కాకుండా నాగలి సహా ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా పూజిస్తారు. రైతులకు ఈ రోజు చాలా ముఖ్యమైనది. రైతులు నాగలిని పూర్తి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. అలాగే తన పంట పచ్చగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. ఈసారి ఆషాఢ అమావాస్య మంగళవారం జూన్ 28న వస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ శుభ సమయం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఆషాఢ అమావాస్య శుభ సమయం
ఆషాఢ అమావాస్య తేదీ ప్రారంభం: 28 జూన్ 2022, ఉదయం 05:53 నుండి
ఆషాఢ అమావాస్య తేదీ ముగుస్తుంది: 29 జూన్ 2022, ఉదయం 08:23 వరకు

ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత
ఆషాఢ అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి సూర్యభగవానునికి స్నానం చేసి నీరు వదలడం ఎంతో ప్రాముఖ్యం. ఈ రోజున ప్రజలు పవిత్ర నదిలో స్నానం చేసి పూర్వీకుల శాంతి కోసం దానం చేస్తారు. ఈ రోజు యాగం చేయడం వల్ల అనంతమైన ఫలితాలు పొందుతారు. పూర్వీకుల శాంతి కోసం పేదలకు సేవ చేయాలి, పేదవారికి ఆహారం మరియు దక్షణ ఇవ్వాలి. ఈ రోజున ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించవచ్చు.