Asha Workers Protest : తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఆశావర్కర్లు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. రూ.18 వేలు వేతనం ఇవ్వాలని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు ఇవ్వాలని, పదోన్నతులు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తదితర డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
Read Also: AC : ఏసీ కొనుగోలు చేయబోతున్నారా..? ఇలా తీసుకుంటే మీకు కరెంట్ బిల్లు ఆదా !
అయితే ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తున్నారు. ఇక, భారీ పోలీస్ బందోబస్తుతో ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. దీంతో కొంత మంది ఆశా వర్కర్లు అక్కడ నెలకున్న గందరగోళ పరిస్థితితో సొమ్మసిల్లి పడిపోయారు. కాగా, ఆశా వర్కర్లన అరెస్టులను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. కాగా, తమ సమస్యలను పరిష్కరించకపోగా.. తమను అరెస్ట్‌లు చేయడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని అరెస్ట్‌లు చేసి తమ వాయిస్‌ను అణచివేయాలనుకుంటే అది కలే అవుతుందని, అరెస్ట్‌లకు భయపడి ఆందోళనను విరమించుకునే ప్రసక్తే లేదని వారు వ్యాఖ్యానించారు.
Read Also: TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించిన టీటీడీ