Jeevan Reddy: అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ బ్రహ్మా స్త్రాలు

కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే కరెంటు కట్ అవుతుందని సంక్షేమ పథకాలు ఔట్ అని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు.

  • Written By:
  • Updated On - November 14, 2023 / 06:01 PM IST

Jeevan Reddy: ఆర్మూర్, నవంబర్14: కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే కరెంటు కట్ అవుతుందని సంక్షేమ పథకాలు ఔట్ అని ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మాక్లూర్ మండలంలోని సట్లాపూర్ తండా, మదన్ పల్లి, వడ్యాట్ పల్లి,అమ్రాద్ తండా,ముత్యంపల్లి, అమ్రాద్ గ్రామాలలో ‘ప్రజాఆశీర్వాద’ యాత్రలు నిర్వహించారు. ప్రతీ గ్రామంలో జీవన్ రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో గ్రామస్తులు, పలు కుల సంఘాలు, ప్రజా సంఘాల పెద్దలు జీవన్ రెడ్డిని సత్కరించారు. మహిళలు బోనాలతో, యువకులు బైక్ ర్యాలీలతో బాణ సంచా కాలుస్తూ సందడి చేశారు.

“జై జీవనన్న, జైజై కేసీఆర్, జై తెలంగాణ”, ఆర్మూర్ గడ్డ జీవనన్న అడ్డా” అన్న నినాదాలతో అన్ని గ్రామాలు మారుమోగాయి. అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలంతా వెంటరాగా ఆయన గ్రామమంతా కలియ తిరిగి ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసు కున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే మళ్లీ తననే గెలిపించాలని గడపగడపకూ తిరిగి అర్ధించారు. అనంతరం సట్లాపూర్ తండా, మదన్ పల్లి, వడ్యాట్ పల్లి,అమ్రాద్ తండా,ముత్యంపల్లి, అమ్రాద్ గ్రామాలలో జరిగిన ప్రజాఆశీర్వాద సభల్లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ మీ గ్రామాల అభివృద్ధికి చేసిన కార్యక్రమాల గురించి వివరించి మీ కడుపులో తలపెట్టి మళ్లీ తనకే ఓట్లు వేయాలని అడగడానికి వచ్చానన్నారు. ఈ సందర్భంగా సట్లాపూర్ తండా, మదన్ పల్లి, వడ్యాట్ పల్లి, అమ్రాద్ తండా,ముత్యంపల్లి, అమ్రాద్ గ్రామాల ప్రగతి నివేదికలను ప్రజల ముందు ఉంచారు.

ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ దొంగలతో బీఆర్ఎస్ చేస్తున్న దంగల్ గా అభివర్ణించారు. తెలంగాణ ద్రోహులతో గులాబీ సైన్యం చేస్తున్న యుద్ధమిది. తెలంగాణ ఆత్మగౌరవం నిలుపుకునేందుకు గుజరాతీ గులాం లతో, ఢిల్లీ బానిసలతో, కర్ణాటక పాదదాసులతో కేసీఆర్ సాగిస్తున్న సమరమిది.సంపద పెంచి ప్రజలకు పంచడం బీఆర్ఎస్ విధానం. తెలంగాణను నిలువునా ముంచ డం కాంగ్రెస్, బీజేపీ నినాదం. అభివృద్ధి, సంక్షేమం అనేవిబీఆర్ఎస్ లో తిరుగులేని బ్రహ్మా స్త్రాలు. కేసీఆర్ అధ్బుత పాలన వల్లే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నది. ఏపల్లెలో చూసినా పండుగ వాతా వరణమే కనిపిస్తోంది. ఏఇంట్లో చూసిన సంక్షేమ సంబురాలే దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ సబ్బండ వర్గాల ఆత్మ బంధువు. “మా తండాలో మా రాజ్యం” అన్న నినాదం సాకారం చేసిన ఘనత కేసీఆర్ దే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గిరిజన సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు 53 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో గిరిజనుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. గిరిజనుల ఆత్మ గౌరవం ప్రతీకలుగా బంజారాహిల్స్ లో రూ.24.68 కోట్లతో ఆదివాసీ భవన్, రూ.24.43 కోట్లతో బంజారా భవన్ ను నిర్మించామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పునరుద్ఘాటించారు.