Site icon HashtagU Telugu

Owaisi: ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ఒవైసీ వార్నింగ్!

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తర ప్రదేశ్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ బహిరంగంగా విరుచుకుపడ్డారు. మోదీ, యోగీ పదవుల నుంచి దిగిపోయిన తర్వాత ఎవరూ మిమ్మల్ని కాపాడలేరన్న విధంగా ఆయన కాన్పూర్ లో జరిగిన బహిరంగ సభ వేదికగా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. అసుదుద్దీన్ ఆవేశపూరిత ప్రసంగానికి సభకు హాజరైన వారు హర్షామోదాలు తెలియజేసినట్టు వీడియో చూస్తే తెలుస్తుంది. బీజేపీ నేతలు ఈ వీడియోను విడుదల చేస్తూ, ఇదేమీ పాకిస్థాన్ కాదని, ఇక్కడ తాలిబన్లకు చోటు లేదని వ్యాఖ్యానించారు.

Exit mobile version