Site icon HashtagU Telugu

Israel-Hamas War: పాలస్తీనాతో నిలబడాలని ప్రధాని మోదీకి అసదుద్దీన్ విజ్ఞప్తి

Israel Hamas War (1)

Israel Hamas War (1)

Israel-Hamas War: ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు మొదలు పెట్టి పది రోజులు కావొస్తుంది. దీంతో ఇరు దేశాలు పరస్పర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందులో వేలాది మంది ప్రజలు గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలను హమాస్ మిలిటెంట్లు బంధించారు. వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్ తమ ప్రజలకు విడిచిపెట్టాలని అప్పటివరకు గాజాకు నీళ్లు, కరెంట్, ఇంధనం, ఎలాంటి సదుపాయాలు ఉండవని తెగేసి చెప్పింది. దీంతో గాజాలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

పాలస్తీనాతో నిలబడాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు అసదుద్దీన్ ఒవైసీ. ఇజ్రాయెల్ హమాస్ బాంబులతో గాజా ప్రాంతంలో నివసిస్తున్న 10 లక్షల మందికి పైగా వారి ఇళ్లను ధ్వంసం చేసి, నీరు, ఆహారం, విద్యుత్ సరఫరా చేయకుండా నిరాశ్రయులను చేయడంపై తీవ్ర బాధను వ్యక్తం చేశారు అసదుద్దీన్. హమాస్‌పై ఇజ్రాయెల్ దురాగతాలకు పాల్పడకుండా ఆపాలని ఎఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

పాలస్తీనియన్లకు భారతదేశం అనుకూలంగా ఉండాలని ప్రధానిని ఉద్దేశించి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు . భారతదేశం అగ్రరాజ్యంగా ఆవిర్భవించి, వీటో పవర్‌తో భద్రతా మండలిలో సభ్యత్వం కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, పాలస్తీనాకు న్యాయం చేసి, గాజా స్ట్రిప్‌లోని హమాస్‌పై బాంబు దాడి నుండి ఇజ్రాయెల్‌ను ఆపాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉందని ఆయన అన్నారు.

Also Read: Congress List Issue: కాంగ్రెస్ అసమ్మతి సెగ… కాంగ్రెస్ కార్యాలయం ధ్వంసం