Hyderabad: అగ్ని ప్రమాద ఘటన బాధితులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

హైదరాబాద్ లో ఇవాళ పలు చోట్ల అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో మరణాలు చోటుచేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోగా, బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

Hyderabad: హైదరాబాద్ లో ఇవాళ పలు చోట్ల అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో మరణాలు చోటుచేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోగా, బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. నాంపల్లి అగ్ని ప్రమాద ఘతనపై పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బజార్ ఘాట్, నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు మరియుక్షతగాత్రులకు ఆర్థిక సహాయం అందేలా చూడాలని అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఆయన బాధిత కుటుంబాల కోసం ప్రార్ధించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Also Read: Telangana BJP Manifesto : బీజేపీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో..ఇదేనా..?