Ramcharan Interview: నాన్నకు మాటల్లో వివరించలేక..కనీళ్లతో హత్తుకున్న-రామ్ చరణ్!!!

మల్టీస్టారర్ మూవీస్ కు ఇంతకుముందు కంటే ఇప్పుడే క్రేజ్ పెరిగింది. ఇద్దరు స్టార్ హీరోలు...మల్టీ స్టారర్ మూవీ చేస్తే ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Acharya

Acharya

మల్టీస్టారర్ మూవీస్ కు ఇంతకుముందు కంటే ఇప్పుడే క్రేజ్ పెరిగింది. ఇద్దరు స్టార్ హీరోలు…మల్టీ స్టారర్ మూవీ చేస్తే ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అయితే ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇచ్చేందుకు మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ ఆచార్య మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నరు. ఈ మధ్యే ఈ మూవీ సెట్ లో జరిగిన ఓ ఉద్వేగభరితమైన సన్నివేశాన్ని పంచుకున్నాడు రాంచరణ్. రామ్ చరణ్ హీరోగా పరిచయమయినప్పటి నుంచి తన తండ్రి చిరంజీవితో పలసార్లు స్క్రీన్ పంచుకున్నాడు. కానీ ఆచార్యలో అలా కాదు. ఇందులో ఈ ఇద్దరు హీరోలే. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి ప్రేక్షకుల అంచాలను భారీగా పెంచేస్తోంది. అంతేకాదు ఈ మూవీ పాట‌లు ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక తన తండ్రి చిరంజీవితో కలిసి పనిచేయడం చాలా గొప్ప విషయమని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రామ్ చరణ్. ఆచార్య వల్ల ఈ అవకాశం వచ్చిందని కొరటాల శివకు ధన్యావాదాలు చెప్పాడు. ఆచార్య షూటింగ్ సమయంలో 20రోజుల పాటు తన తండ్రితో కారులో ప్రయాణించడం, తన సమయాన్ని గడపడం గొప్పగా నిలిపోతాయన్నాడు. తనకు ఒకరోజు కలిగిన అద్బుతమైన అనుభూతిని తన తండ్రికి మాటల్లో వివరించలేక కన్నీళ్లతో హత్తుకున్నాని చెప్పాడు. ఇక ఏప్రిల్ 29న రిలీజ్ కానున్న ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 23న జరగనుంది. ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్టులుగా పవన్ కల్యాణ్, రాజమౌళి రానున్నట్లు సమాచారం.

  Last Updated: 21 Apr 2022, 02:23 PM IST