Delhi CM Atishi: ఢిల్లీలో గాలి కాలుష్యం.. పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించిన సీఎం

ఢిల్లీలో GRAP-4 అమలుతో నవంబర్ 18 నుండి 10, 12 తరగతులు మినహా అన్ని విద్యార్థులకు శారీరక తరగతులు నిలిపివేయబడతాయని ముఖ్యమంత్రి అతిశి తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Delhi CM Atishi

Delhi CM Atishi

Delhi CM Atishi: దేశ‌ రాజధాని ఢిల్లీలో చలితో పాటు వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తీవ్రమైన కేటగిరీకి చేరుకుంది. దీనికి సంబంధించి సోమవారం నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో GRAP స్టేజ్-4 ఆంక్షలు అమలులోకి రానున్నాయి. దీని తరువాత ఢిల్లీ ప్రభుత్వం 10-12 మినహా అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 450 దాటింది.

రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం పిల్లల చదువులపైనా ప్రభావం చూపుతోంది. పెద్ద వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో సబ్‌కమిటీ GRAP-4 ఆంక్షలు విధించింది. జీఆర్‌పీఏ-4 అమల్లోకి వచ్చిన తర్వాత సీఎం అతిషి (Delhi CM Atishi) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు.

Also Read: Deputy CM Bhatti: కూటమిని గెలిపించండి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి: డిప్యూటీ సీఎం భ‌ట్టి

ఢిల్లీలో పాఠశాలలు మూతపడ్డాయి

ఢిల్లీలో GRAP-4 అమలుతో నవంబర్ 18 నుండి 10, 12 తరగతులు మినహా అన్ని విద్యార్థులకు శారీరక తరగతులు నిలిపివేయబడతాయని ముఖ్యమంత్రి అతిశి తెలిపారు. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులు మాత్రమే పాఠశాలకు వెళ్లగా, ఇతర తరగతుల విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువుతారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్ప‌టికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని సూచించగా.. తాజాగా 6 నుంచి 9, 11తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కమిషన్‌ సూచించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఆతిశీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం జరగనుంది

ఢిల్లీలో GRAP-4ను సమర్థవంతంగా అమలు చేసేందుకు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సంబంధిత శాఖల అధిపతులతో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ సెక్రటేరియట్‌లో సమావేశం కానున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ సమావేశంలో GRAP-4 ఆంక్షలు ఎలా, ఎక్కడ అమలు చేయాలనే అంశంపై చర్చించనున్నారు.

  Last Updated: 18 Nov 2024, 07:34 AM IST