Andhra Adivasi: మన్యంలో వాటర్ వార్

ఏపీలోని మన్యం ప్రాంతాలు కనీస వసతులు లేక అల్లాడుతున్నాయి.

  • Written By:
  • Updated On - August 8, 2022 / 05:17 PM IST

ఏపీలోని మన్యం ప్రాంతాలు కనీస వసతులు లేక అల్లాడుతున్నాయి. కనీసం తాగడానికి చుక్కానీరు లేక దాహమో రామచంద్రా అంటూ రోడ్డుక్కెతున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మూలపేట పంచాయతీలోని జాజులు బంధ గ్రామస్తుల తాగునీటి కోసం అనేక కష్టాలు పడుతున్నాయి. ఈ గ్రామంలో ఉన్న 170 మంది కొందు తెగకు చెందిన ఆదివాసీ గిరిజనులు చాపరాయి మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  అది కూడా సురక్షితమైన నీరు కాదు ఆదివాసీ బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాకాలం ఆ చాపరాయి నాచు పట్టి ప్రమాదకరంగా మారుతుంది. ఈ జాజులు బంధ గ్రామస్తుల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్ళాలి. గత జూన్ నెలలో శాంతి అనే గర్భిణిని ప్రసవం కోసం డోలీలో 9 కిలోమీటర్లు మోసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ గిరిజనుల కష్టాలను గుర్తించి, వారికి సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలి. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదివాసీలతో పాటు టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.