ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (Delhi Election Results) ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)లో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆప్ జాతీయ సమన్వయకారుడు, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శుక్రవారం 70 మంది అభ్యర్థులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఎన్నికల ఫలితాల కంటే ముందుగా జరుగుతుండటంతో అనేక రాజకీయ ఊహాగానాలకు తావిస్తోంది. ఈ సమావేశం వెనుక ప్రధాన కారణంగా.. ‘ఆపరేషన్ లోటస్’ ఆరోపణలు ప్రధానంగా చెప్పుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏడు మంది ఆప్ ఎమ్మెల్యేలకు పార్టీ మారేందుకు 15 కోట్ల రూపాయల ఆఫర్లు వచ్చాయని ఆరోపించారు. ఈ పరిస్థితులపై చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Tragedy : మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో విషాదం
అరవింద్ కేజ్రీవాల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కూడా తీవ్రంగా స్పందించారు. “ఒకవేళ ఎగ్జిట్ పోల్స్‌లో ఏదైనా పార్టీ 55కు పైగా సీట్లు గెలుస్తుందని చెబుతుంటే, మా అభ్యర్థులకు ప్రలోభాలు ఎందుకు ఇస్తున్నారు?” అని ప్రశ్నించారు. ఈ సర్వేలన్నీ నకిలీగా ఉంటాయని, అభ్యర్థులపై మానసిక ఒత్తిడి తేవడమే లక్ష్యమని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల కమిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVM) భద్రతను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. రాజధానిలో మొత్తం 19 స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసి, 24 గంటల భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా స్ట్రాంగ్ రూమ్ ఉండేలా ఏర్పాట్లు చేశారు.