Site icon HashtagU Telugu

Arvind Dharmapuri: వాళ్లు నిజమైన రైతులు కాదు!

Arvind

Arvind

అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య వరి వార్ తీవ్రస్థాయిలో  కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్ల విషయమై నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి ఎదుట కొంతమంది వరి ధాన్యం కుప్పలుగా పోసి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే విషయమై ఎంపీ అరవింద్ రియాక్ట్ అయ్యారు. ‘‘నా ఇంటి దగ్గరికి నిరసన తెలిపినవాళ్లు నిజమైన రైతులు కాదు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ద్వారా కూలీకి వచ్చిన దినసరి కూలీలు’’ అని ఆయన స్పష్టం చేశారు.