Site icon HashtagU Telugu

Srisailam: వైభవంగా మల్లికార్జునుడి వార్షిక ఆరుద్రోత్సవం

Srisailam Devasthanam

Srisailam Devasthanam

ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా శ్రీశైలంలో మల్లికార్జునస్వామికి వార్షిక ఆరుద్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నిన్న రాత్రి 10 గంటల నుంచి స్వామి వారికి మహాన్యాస పూర్వక లింగోద్భావ కాల రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించిన దేవస్థానం సోమవారం ఈ తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల ప్రాతఃకాల పూజలు చేశారు. అనంతరం ఉత్తరద్వార దర్శనం కల్పించారు. నందివాహన సేవ, ఆలయ మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఆరుద్రోత్సవం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మారుమ్రోగిపోయాయి. స్వామివారికి అభిషేకాలు కన్నుల పండువగా జరిగాయి.

Exit mobile version