సుప్రసిద్ధ రచయిత్రి, సినీ రచయిత ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మీ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్థాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ మలక్‌పేట్‌లోని తన నివాసంలో శుక్రవారం కన్నుమూశారు. 1930 డిసెంబర్ 31న కోటనందూరులో జన్మించిన రామలక్ష్మీ.. మద్రాస్ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టభద్రురాలయ్యారు. 1951 నుంచి రచనలు సాగిస్తున్నారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీష్ విభాగానికి ఉప సంపాదకులుగా పలు అనువాదాలు చేశారు రామలక్ష్మీ.
Arudra wife: దిగ్గజ కవి ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మీ కన్నుమూత

Arudra Wife