Site icon HashtagU Telugu

Kinnera Mogulaiah: కిన్నెర మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు!

mogalaiah

mogalaiah

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో ఏడుమెట్ల కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ ఓ వ్యక్తిగా కనిపిస్తాడు. అంతరించిపోతున్న కళకు ఊపిరిలూదుతున్న ఆ అరుదైన కళాకారుడే మొగులయ్య. అతి సామాన్యమైన ఈ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం హర్షించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవి ప్రాంతం ఓ కుగ్రామంలో జన్మించిన మొగిలయ్య ను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించినందుకుగానూ ప్రతిఒక్క కళాకారుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించారు. ఏపీలో ముగ్గురికి, తెలంగాణలో ముగ్గురికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణలో దర్శనం మొగిలయ్య, పద్మజారెడ్డి, రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కాయి. ఏపీలో గరికపాటి నర్సింహారావు, సుంకర వెంకట ఆదినారాయణకు, గోసవీడు షేక్ హసన్‌కు పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.