Site icon HashtagU Telugu

Jeevan Arrest: కేసీఆర్ పై రేవంత్ ఫైర్

jeevan reddy protest

jeevan reddy protest

కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోందని, దీనికి మూల్యం తప్పక చెల్లించుకుంటారని టీపీసీసీ చీఫ్ రేవంత్ హెచ్చరించారు.

317 జీవో కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న బీంగల్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కారును పోలీసులు వెంటపడి కమ్మర్ పల్లి వద్ద అడ్డుకుని అరెస్టు చేసారు.

ఈ చర్యను రేవంత్ ఖండించారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించడానికి వెళ్తున్న నేత‌ల‌ను కూడా అరెస్టు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

ప్రజల సమస్యలపై స్పందించే ప్రతిపక్ష నేతలు కేసీఆర్ కు దొంగల్లా కనిపిస్తున్నారా అని రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కని, బాధిత కుటుంబాలను పరామర్శించడాన్ని నేరంలాగా చూస్తున్నారని రేవంత్ విమర్శించారు.