ArogyaSri Stopped: రేపటి నుంచి ఆరోగ్య శ్రీ బంద్.. పేదలకు షాక్!

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ విషయాన్ని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి.

  • Written By:
  • Publish Date - May 18, 2023 / 10:39 PM IST

ArogyaSri Stopped: ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ విషయాన్ని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి.
మే 19 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకి నోటీసు ద్వారా తెలియజేసింది. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్స ఉంది. ఆరోగ్య శ్రీ క్రింద ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించక పోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ క్రమంలో రేపటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నిర్ణయంలో ఎంతోమంది రోగులకు వైద్యం ఆగనుంది. ఎంతోమంది పేదలు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ వైద్యం పొందుతున్నారు. దీని వల్ల ఎంతోమంది పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కానీ ఇప్పుడు ఆగిపోవడం వల్ల ఎంతోమంది పేదలు ప్రైవేట్ వైద్యానికి దూరం కానున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్దరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దాదాపు ఏడాదిగా ఆరోగ్య శ్రీ క్రింద ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదు. ఇవి పేలుకుపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా భారంగా మారుతోంది. దీంతో ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయలేదు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నెట్ వర్క్ ఆస్పత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఆరోగ్య శ్రీ కేసులను నిలిపివేయడం వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని, దీని ద్వారా బకాయిలు చెల్లించే అవకాశముంటుందని ఆశ పడుతున్నారు.