Army Helicopter Crashes: అడవుల్లో కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లకు గాయాలు

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతం అయిన మాడ్వాలోని మచ్నా అడవుల్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయి (Army Helicopter Crashes) ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

  • Written By:
  • Publish Date - May 4, 2023 / 01:36 PM IST

Kishtwar: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతం అయిన మాడ్వాలోని మచ్నా అడవుల్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయి (Army Helicopter Crashes) ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కుప్పకూలిన హెలికాప్టర్ సైన్యానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్. ఈ ప్రమాదంలో పైలట్లకు గాయాలయ్యాయని, అయితే వారు సురక్షితంగా ఉన్నారని ఆర్మీ అధికారి తెలిపారు. మరింత సమాచారం అందాల్సి ఉందని ఆర్మీ అధికారి తెలిపారు.

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో ముగ్గురు వ్యక్తులు ఉండగా, అందులో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సైన్యానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్లకు గాయాలైనప్పటికీ వారు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఈ సంఘటన కిష్త్వార్‌లోని మార్వా ప్రాంతంలో జరిగింది. పోలీసు అధికారి ప్రకారం.. హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం కనుగొనబడింది. అయితే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Murdered: తెలంగాణ హైకోర్టు దగ్గర వ్యక్తి దారుణ హత్య!

జమ్మూకశ్మీర్‌లో హెలికాప్టర్‌ కూలడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా అనేక ప్రమాదాల్లో మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మార్చి ప్రారంభంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని మాండ్లా కొండ సమీపంలో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ప్రమాదం తర్వాత వారి కోసం భారత సైన్యం, సాయుధ బలగాలు, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.