TTD: తిరుమల వెంకన్న’ భక్తులకు గుడ్ న్యూస్… ఈనెల 20 నుంచి అందుబాటులోకి ‘ఆర్జిత సేవా టికెట్లు’..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక శుభవార్త చెప్పారు. 2022 ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది టీటీడీ. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మరియు నిజ పాద దర్శనం మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా కేటాయించనున్నారు. ఈనెల 20 వ […]

Published By: HashtagU Telugu Desk
567

567

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక శుభవార్త చెప్పారు. 2022 ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది టీటీడీ. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మరియు నిజ పాద దర్శనం మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా కేటాయించనున్నారు.

ఈనెల 20 వ తేదీ ఉదయం 10 గంటల నుండి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు కేటాయిస్తారు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మొదటిగా బుక్ చేసుకున్న వారికి మొదటిగా (FIFO పద్ధతిన) కేటాయించనున్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.

  Last Updated: 17 Mar 2022, 09:49 AM IST