Telangana : బిఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతుందా..? కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా..?

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 10:41 AM IST

తెలంగాణ అధికార పార్టీ (BRS) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ అధిష్టానం అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ షాకులు ఎక్కువైపోతున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయించడం..చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల కు వ్యతిరేకత ఉన్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా టికెట్ కేటాయించడం ఫై సొంత పార్టీ శ్రేణులే కాదు ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే తరుణంలో రెండు , మూడు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వారికీ ఛాన్స్ ఇవ్వడం కూడా తట్టుకోలేకపోతున్నారు. మరోపక్క ఈసారైనా పార్టీ తమకు టికెట్ ఇస్తుందని ఆశగా ఎదురుచూసిన కొంతమందికి మొండిచెయ్యి చూపించేసరికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడినా ప్రతిఫలం లేదని చెప్పి..వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

ఈ తరుణంలో కరీంనగర్ లో బిఆర్ఎస్ పార్టీ కి భారీ తగలబోతున్నట్లు తెలుస్తుంది. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ (Arepally Mohan) కాంగ్రెస్ (Congress) లోకి చేరబోతున్నట్లు తెలుస్తుంది. బిఆర్ఎస్ అధిష్టానం తనకు ఈసారైనా మానకొండూరు టికెట్ ఇస్తుందని గంపెడాశలు పెట్టుకున్న మోహన్ కు ఇటీవల టికెట్ల కేటాయింపులో మొండిచేయి దక్కింది. ఇప్పటికే తనకు ఏజ్ ఎక్కువగా ఉండడంతో అతనికి ఇవే చివరి ఎన్నికలని భావిస్తున్న క్రమంలో భవిష్యత్లో మరోసారి పోటీచేసే అవకాశాలు లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు భవిష్యత్లో ఏదైనా నామినేటెడ్ పోస్టు కేటాయింపుపై అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు.

Read Also : Kangana Ranaut : రోజా ఎవరో నాకు తెలియదని షాక్ ఇచ్చిన కంగనా..

తన రాజకీయ మారేందుకు భవితవ్యంపై పలువురు పార్టీ పెద్దలను సంప్రదించేందుకు ప్రయత్నించిన ఆరెపల్లి మోహన్ అవేవీ సఫలీకృతం కాకపోవడంతో మరింతనిరుత్సాహానికి గురయ్యారు. ఈ విషయంపై గత కొన్నిరోజులుగా తన అనుచరులతో సమాలోచనలు జరిపిన ఆరెపల్లి మోహన్ సొంత పార్టీ అయినా కాంగ్రెస్ లోకే వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 30న మాజీ ఎంపీ వివేక్ ఆరెపల్లి మోహన్ ఇద్దరు కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆరెపల్లి మోహన్ సొంతగూటికి చేరనున్నారు.