Hyderabad: హైదరాబాద్ నగర ప్రజలు తాగునీటిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు ప్రకటించింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తాగునీటికి డిమాండ్ ఏర్పడుతున్నదని, మార్చి లోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో వాటర్ డిమాండ్ పీక్ స్టేజ్ కి వెళ్తుందని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ వాటర్ సప్లై బోర్డు అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు అందరికీ తాగునీరు సరఫరా చేయాలంటే వృధాను అరికట్టాలని, ఇతర వాణిజ్య అవసరాలకు తాగునీటిని వినియోగించడం నిలుపుదల చేయాలని నిర్ణయించామని వారి పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలను గండిపేట, ఉస్మాన్ సాగర్, నాగార్జునసాగర్, గోదావరి జిల్లాలో తీరుస్తున్నాయి. గత ఏడాది ఆశించినత స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో జలాశయాలలో అంతర్దమాత్రంగానే నీరు నిల్వ ఉంది. ఈ నీటిని పొదుపుగా వాడేలా ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.ఇక ప్రస్తుతం మన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపు దాల్చింది. బెంగళూరు నగరంలో క్యాన్ నీటి కోసం ప్రజలు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇక హైదరాబాద్ నీటి సమస్యను పరిష్కరించేందుకు వాటర్ అధికారులు రాత్రి వేళల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.