Bank Jobs: బ్యాంక్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా.. ఫ్రీ కోచింగ్ ఇదిగో

Bank Jobs: హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో 2 నెలల నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పెద్దపల్లి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి తెలిపారు. ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్ మెంట్ ఉంటుందన్నారు. గ్రాడ్యుయేట్, 26 ఏళ్ళు లోపు ఉన్న అర్హులైన అభ్యర్థులు www.tsbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ లో ఈ నెల 25 […]

Published By: HashtagU Telugu Desk
ISRO Jobs

Jobs

Bank Jobs: హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో 2 నెలల నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పెద్దపల్లి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి తెలిపారు. ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్ మెంట్ ఉంటుందన్నారు. గ్రాడ్యుయేట్, 26 ఏళ్ళు లోపు ఉన్న అర్హులైన అభ్యర్థులు

www.tsbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ లో ఈ నెల 25 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, కేవలం బీసీ అభ్యర్థులు మాత్రమే అర్హులని, ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ను ఈ నెల 31న ఉమ్మడి జిల్లా కరీంనగర్ లో నిర్వహిస్తారనీ, అభ్యర్థి తల్లిదండ్రుల వార్షికాదాయం 5 లక్షల లోపు ఉండాలనీ, ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా 30 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందనీ, మరింత సమాచారం కొరకు 040-29303130 నందు సంప్రదించాలి.

  Last Updated: 20 Mar 2024, 12:00 AM IST