Site icon HashtagU Telugu

Cyber Crime: మీ ఫోన్ కు మిస్డ్ కాల్స్‌ వస్తున్నాయా.. అయితే జర జాగ్రత్త!

Phoness

Phoness

Cyber Crime: కొన్నిసార్లు అపరిచత వ్యక్తుల నుంచి మిస్డ్ కాల్స్ వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొత్త నెంబర్ కనిపించగానే ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకోవడానికి తిరిగి కాల్ చేస్తుంటాం. అయితే కొన్ని అపరిచిత నెంబర్ల నుంచి వరుసగా మూడు సార్లు మిస్డ్ కాల్స్ వస్తే.. ఆ నెంబర్లకు తిరిగి కాల్ చేయొద్దు. ఒకవేళ మీరు అలా చేశారంటే మీ బ్యాంకు అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.అపరిచిత నెంబర్ల నుంచి వరుసగా మిస్డ్ కాల్స్ వచ్చినట్లయితే వాటిని అలా వదిలేయడమే మంచిది.

మరీ ముఖ్యంగా మిమ్మల్ని తికమక పెట్టే ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే జాగ్రత్త తప్పనిసరి. అదేవిధంగా సిమ్ కార్డుకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. వెంటనే సంబంధిత సిమ్ కార్డ్ కంపెనీ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి కానీ ఎవ్వరితో ఎలాంటి సమాచారం షేర్ చేసుకోవద్దు. కొత్త SIM కార్డ్ ఇస్తాం అంటూ ఎవ్వరైనా ఫోన్ చేసినా ఎలాంటి సమాచారాలు పంచుకోవద్దు.

మీ సిమ్ కి సంబంధించి సంబంధిత ఆపరేటర్ సంస్థతో మాత్రమే వ్యక్తిగత సమాచారాలు పంచుకోవాలి. సిమ్ స్వైప్ స్కామ్ లలో ఓటీపీ దొంగతనం అనేది ఓ టెక్నీక్. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో కూడా మెసెజెస్, ఓటిపిలు ఫార్వార్డ్ చేయొద్దు.ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి వ్యక్తిగత సమాచారాలను చాలా భద్రంగా ఉంచుకోవాలి. ఇలాంటివి ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని సైబర్ నిపుణులు చెబుతున్నారు. మీ ఇంటి అడ్రస్, మొబైల్ నెంబరుకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని తెలియని వ్యక్తులతో షేర్ చేసుకోవడం వల్ల భారీ నష్టం వచ్చే ప్రమాదం ఉంది.

Also Read: Sachin Tendulkar: కోహ్లీ నా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం: సచిన్ టెండూల్కర్