Social Media : సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదిస్తున్నారా..? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 04:56 PM IST

ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) వాడకం ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా జియో (Jio) ఫ్రీ నెట్ అందుబాటులోకి వచ్చిన దగ్గరినుండి ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లు వాడడం స్టార్ట్ చేసారు. కూలిపనులు చేసుకునే వారిదగ్గర నుండి లక్షలు సంపాదించే వారి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు (Smart Phones) వాడుతుండడం..సోషల్ మీడియా లో యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా ద్వారా కేవలం టైం పాస్ మాత్రమే కాదు భారీ ఎత్తున ఆదాయం (Social Media Income) కూడా వస్తుండడం తో చాలామంది ఇందులోనే గడుపుతున్నారు.

తనలోని టాలెంట్ ను మొత్తం సోషల్ మీడియా మీద పెడుతూ నెలకు లక్షలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ (Youtube) ద్వారా సాఫ్ట్ వెర్ ల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. వీరి ఆదాయం చూసి స్టార్స్ సైతం షాక్ అవుతున్నారు . ఇలా రోజు రోజుకు యూట్యూబర్స్ (Youtubers) ఎక్కువై పోతుండడం..సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా భారీ ఎత్తున ఆదాయం సంపాదిస్తుండడం తో ఆదాయపు పన్ను శాఖా వీరి ఫై నిఘా పెట్టింది.

ట్విట్టర్ (Twitter) , ఇన్ స్ట్రాగ్రమ్ (Instagram), యూట్యూబ్ (Youtube) వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల ద్వారా వచ్చే ఆదాయం ఫై కూడా పన్ను విధించబడుతుందని పేర్కొంది. ఇందుకోసం ఆదాయపు పన్ను (Income Tax Department) రిటర్న్ లో ప్రభుత్వం ఒక నిబంధన చేసింది. సోషల్ మీడియా వెబ్ సైట్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించే వారు పూర్తి సమయం ప్రాతిపదికన కంటెంట్ సృష్టిలో నిమగ్నమై ఉంటె..సోషల్ మీడియా ద్వారా సంపాదించిన ఆదాయమే ప్రాథమిక వనరు అయినట్లయితే, అది వ్యాపారం లేదా వృత్తి, లాభాల కింద వక్రీకరించబడుతుంది అని దీని పన్ను విధించబడుతుందని పేర్కొంది. ఇదో రకంగా చాలామంది నిర్ణయమనే చెప్పాలి. మొన్నటి వరకు కేవలం జాబర్స్ మాత్రమే ఇలా టాక్స్ (Income Tax) కడుతూ వచ్చారు..కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా సంపాందించే వారు సైతం టాక్స్ కడితే అది దేశానికి బాగుంటుంది..అలాగే వారికీ బాగుంటుంది. సో సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించే వారు ఇది గమనిస్తే చాల మంచిది.