Site icon HashtagU Telugu

Cyberabad: క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త, సైబరాబాద్ పోలీసుల సూచనలు ఇవే

Cyber Security

Cyber Security

Cyberabad: గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ తన అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందని దాని గురించి విచారిచింది. అతని అకౌంట్లో ఉన్న లక్ష ఇరవై వేలు రూపాయలు ఫ్రీజ్ చేయబడింది. ఈ విద్యార్థి తన ఖర్చుల కోసం p2p క్రిప్టో ట్రేడింగ్ చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర ఉన్నది ఈ లక్ష 20వేల రూపాయ లే.. ఇప్పుడు అది మొత్తం బ్యాంకులో ఫ్రీజ్ అయింది. దీనికి కారణం p2p ట్రాన్సాక్షన్ లో ఈ విద్యార్థి ట్రేడింగ్ చేసినది ఒక సైబర్ క్రిమినల్ తో. బాధితుల దగ్గర నుండి వచ్చిన డబ్బులు ఇలా P2P ట్రాన్సాక్షన్ లో అమాయకులైన వారికి ఎక్స్ చేంజ్ చేసి సైబర్ క్రిమినల్స్ తప్పించుకొని అమాయకులని ఇరికిస్తున్నారు.

1930 కి అసలైన బాధితులు రిపోర్ట్ చేసినప్పుడు బాధితుల నుంచి డబ్బులు ఏ ఏ బ్యాంక్ అకౌంట్లకు మరలా యో ఆ అన్ని అకౌంట్లు ప్లీజ్ చేయబడతాయి. ఈ విషయం గ్రహించిన సైబర్ క్రిమినల్స్ తాము తాము కొల్లగొట్టిన డబ్బులు పోగొట్టుకోకుండా మరొక అమాయకులని బలి చేస్తున్నారు.

క్రిప్టో ట్రేడింగ్ చేసి లాభం పొందాలని P2P ట్రాన్సాక్షన్స్ చేస్తూ న్యాయబద్ధమైన డబ్బులు తెలిసో తెలియకో దొంగ సొమ్ముకు మార్చుకుంటున్నారు జాగ్రత్త.. పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో మీకు P2P లో వచ్చిన డబ్బులు సైబర్ నేరస్తులు కొల్లగొట్టిన డబ్బులు అది నిరూపించ బడితే , ఆ డబ్బులు అసలు బాధితుడు ఎవరైతే ఫిర్యాదు చేశారో అతనికి బ్యాంకు మీ ఖాతా నుండి బాధితుడి ఖాతాకు పంపుతుంది. కాబట్టి వ్యవస్థీకృతం కాని ఇటువంటి క్రిప్టో ట్రేడింగ్ ముఖ్యంగా P2P mode లో చేయవద్దు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం అవగాహన కల్పిస్తున్నారు.