Alien’s Listening: గ్రహాంతరవాసులు వింటున్నారా? మరోసారి మెసేజ్ పంపించేందుకు శాస్త్రవేత్తలు సిద్దం.!!

గ్రహాంతరవాసుల ఉనికి గురించి రకరకాల వాదనలు రోజూ వస్తూనే ఉంటున్నాయి.

  • Written By:
  • Publish Date - April 19, 2022 / 04:55 PM IST

గ్రహాంతరవాసుల ఉనికి గురించి రకరకాల వాదనలు రోజూ వస్తూనే ఉంటున్నాయి. అయితే విశ్వం ఉందని..అందులో భూమిలా ఇతర గ్రహాలు ఉన్నాయని…భూమిపై ఉన్నట్లుగానే ఏదోక గ్రహంలో ఇతరుల ఉనికి ఉండే అవకాశం ఉందన్నది నిజమే కావచ్చు. అయితే వాటికి సంబంధించిన ఆధారాలు మాత్రం కచ్చితంగా లేవు. తెలిస్తే తప్పనిసరిగా వారితో సంప్రదింపులు జరుపుతారు. విశ్వంలో భూమి ఉన్న స్థానాన్ని తెలుపుతూ అంతరిక్షంలోకి సమాచారం పంపుతున్నారు. మనుషులు ఎక్కడ ఉన్నారో తెలుపుతూ ఏలియన్స్ కు సంకేతాలు పంపిస్తున్నారు.

మనిషితొలిసారిగా 1974లో చంద్రుడిపై కాలు మోపాడు. అప్పటి నుంచి రోదసిలోకి మరింత చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతర సౌర కుటుంబాలు, జీవి ఉనికి ఉండే అవకాశాలు ఉన్న గ్రహాల అన్వేషన ముమ్మరం చేశారు. మానవుడు చంద్రుడిపై కాలుమోపిన తర్వాత శాస్త్రవేత్తలు ఏలియన్స్ కోసం ఓ రేడియో సందేశాన్ని అంతరిక్షంలోకి పంపారు. పూర్టో రికోలోని ఎర్రసిబో టెలిస్కోప్ ద్వారా జీవి ప్రాథమిక రసాయనాలు, DNA స్ట్రక్చర్, సౌర వ్యవస్థలో భూమి ఉన్న ప్రాంతం, మనిషి ఆకారం వంటి వివరాను ఆ సిగ్నల్స్ లో పొందుపరిచి పంపించారు.

అయితే ఈ విశాల అంతరిక్షంలో ఆ మెసేజ్ ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. మళ్లీ సుమారు 50 సంవత్సరాల తర్వాత మరోసారి ఏలియన్స్ కోసం మెసేజ్ పంపించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. మన పాలపుంత గెలాక్సీలోనే ఏవైనా ఏలియన్స్ ఉన్నట్లయితే వాటితో కమ్యూనికేట్ ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యంతో మళ్లీ రేడియో మెసేజ్ ను పంపించాలన్న ఆలోచనలు చేస్తున్నారు. ఈ మెసేజ్ లో కమ్యూనికేషన్ కోసం అవసరమైన చిన్ని ప్రిన్సిపుల్స్, బేసిక్ మ్యాథ్స్ కాన్సెప్ట్‌లు, ఫిజిక్స్ ఫార్ములాలు, DNA కణాలతోపాటు మనిషి, భూగ్రహం వివరాలను సందేశంలో నిక్షిప్తంగా పంపించాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు. ఈ సందేశం అందితే తర్వాత మనుషులతో కమ్యూనికేట్ కావాలనుకుంటే తిరిగి సందేశం పంపడానికి కావాల్సిన చిరునామాను కూడా ఈ మేసేజ్ లో పొందుపరిచారు. మన మిల్కివే గెలాక్సీలో ప్రాణం ఉండే అవకాశాలు ఉన్న ప్రాంతాలకు.. గ్రహ సముదాయాలు లక్ష్యంగా చేసుకుని ఈ సందేశాన్ని చైనాలోని స్పెరికల్ రేడియో టెలిస్కోప్, ఉత్తర కాలిఫోర్నియాలోని ESTI ఇన్‌స్టిట్యూట్స్ ఆలెన్ టెలిస్కోప్ ఆరె ద్వారా పంపించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మిల్కీ వే గెలాక్సీలో వ్యోమగాములు కొన్నేళ్లుగా పరిశోధనలు జరుపుతున్నారు. మన గెలాక్సీలో జీవి మనుగడకు అనుకూలంగా ఉన్న సుమారు 5000 ప్రపంచాలను నాసా గుర్తించింది. కానీ, ఈ ప్రపంచాలన్నింటినీ అధ్యయనం చేయడం అంత సులభం కాదని ఆస్ట్రానామార్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ సందేశాన్ని వినే తెలివిగల జంతువులు లేదా జీవులు ఉండటం అరుదు అంటున్నారు. అయితే, ఒక వేళ ఈసందేశాన్ని చూసినా వాటికి రెస్పాండ్ కావడం అరుదు. ఈ బ్రాడ్ క్యాస్ట్ సిగ్నల్స్‌ను తీసుకున్న తర్వాత తిరిగి భూమిపైకి పంపిస్తాయని భావించడం మూర్ఖత్వంగానే భావించాలని పేర్కొంటున్నారు.