Old Mummy: చెత్త‌కుప్ప కింద మూడువేల ఏళ్ల నాటి మ‌మ్మీని గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్తలు

లాటిన్ అమెరికా దేశమైన పెరూలో చెత్త కుప్ప కింద మూడు వేల ఏళ్ల నాటి మమ్మీ లభ్యమైంది.

  • Written By:
  • Publish Date - June 17, 2023 / 09:30 PM IST

లాటిన్ అమెరికా దేశమైన పెరూలో పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు (Archaeologists) సుమారు మూడు వేల సంవ‌త్స‌రాల నాటి మ‌మ్మీ (mommy)ని క‌నుగొన్నారు. శాన్‌మార్కోస్ యూనివ‌ర్శిటీ (San Marcos University)కి చెందిన విద్యార్థులు చెత్త‌కుప్ప‌లో త‌వ్వ‌కాలు జ‌రుపుతున్నప్పుడు పుర్రె, వెంట్రుక‌లు, ఇత‌ర భాగాలను క‌నుగొన్నారు. దీనిని బ‌య‌ట‌కు తీసి ప‌రిశీలించ‌గా.. ఈ మ‌మ్మీ బ‌హుశా 1500 లేదా 1000 బీసీ మ‌ధ్య లిమా లోయ‌ల‌లో అభివృద్ధి చెందిన మంచె సంస్కృతికి చెందిన‌దిగా భావిస్తున్నారు. పురావ‌స్తు శాస్త్రవేత్త మిగ్యుల్ అగ్విల‌ర్ మాట్లాడుతూ.. సూర్యోద‌యం వైపు చూసే యూ- ఆకారంలో నిర్మించిన ఆల‌యాల నిర్మాణంతో సంబంధం క‌లిగి ఉంది.

పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు మొక్క‌జొన్న‌, కోకా ఆకులు, విత్త‌నాల‌తో స‌హా శ‌రీరంతో పాతిపెట్టిన ఇత‌ర వ‌స్తువుల‌ను వెలికితీశారు. అవి నైవేద్యంలో భాగ‌మ‌ని వారు భావిస్తున్నారు. చారిత్రాత్మ‌క అవ‌శేషాలకోసం ఎనిమిది ట‌న్నుల చెత్త‌ను తొల‌గించిన త‌రువాత దీనిని గుర్తించిన‌ట్లు పురావ‌స్తు శాస్త్ర‌వేత్త మిగ్యుల్ అగ్యిల‌ర్ తెలిపారు. యూ- ఆకారంలో ఉన్న దేవాల‌యం మ‌ధ్య‌లో ఉన్న స‌మాధిలో మ‌మ్మీని ఉంచార‌ని తెలిపారు.

Chad Doerman: అమెరికాలో దారుణం.. ప‌దేళ్ల‌లోపు వ‌య‌సున్న ముగ్గురు చిన్నారుల‌ను కాల్చి చంపిన తండ్రి..