Site icon HashtagU Telugu

High Waves: ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. అల్లకల్లోలంగా మారిన అరేబియా సముద్రతీరం?

High Waves

High Waves

నైరుతీ రుతుపవనాల కారణంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా మహారాష్ట్ర గుజరాత్ అస్సాం వంటి దేశాలలో భారీ వర్షాల కారణంగా చాలా వరకు ఊర్లన్నీ జలదిగ్బదం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందల సంఖ్యలో గ్రామాలు నీట మునిగాయి. అలాగే ముంబైలో కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆగకుండా వర్షాలు కురవడం కారణంగా వరదలు ప్రవహిస్తున్నాయి. దీంతో ముంబై నగరాన్ని భారీ వర్షాలు వరదలతో ముంచెత్తుతున్నాయి.

కాగా ఇప్పటికే ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ఆదివారం నుంచి విరామం లేకుండా వర్షాలు పడడంతో లోతట్టు ప్రాంతాలు అయినా అందేరితో పాటు అండర్ పాస్ లు, సభ్యు వేలలో వరద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత వారం రోజులుగా నగరంలోని ప్రజలు బయటికి రావాలి అంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కూడా అందేరీలో భారీ వర్షం పడటంతో సబ్ వేలో భారీగా వరద నీరు నిలిచింది. దీంతో కిలోమీటర్ల వేల వాహనాలు రాకపోకలు స్తంభించిపోయాయి. తర్వాత వర్షం తగ్గి ముఖం పట్టడంతో వెంటనే అధికారులు ఆ నీటిని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

అయితే నైరుతి రుతుపవనాలు రాక కాస్త ఆలస్యమైనప్పటికీ ముంబైలో జూన్ లో కురవాల్సిన 75 శాతం వర్షాలు కురిసేసాయి అని అధికారులు వెల్లడించారు. మరొకవైపు ముంబైలోని అరేబియా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రాన్ని తీరాన్ని ఆనుకుని ఉన్న మెరైన్ డ్రైవ్ అనగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డు వైపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దాంతో సముద్ర ప్రాంతమంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. వెంటనే తీర ప్రాంతాల ప్రజలను తరలించాలని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని అధికారులు ఆదేశించారు..