Site icon HashtagU Telugu

AR Rahman’s Daughter: సోషల్ మీడియాలో తన కూతురి పెళ్లి ఫొటోను షేర్ చేసిన ఏఆర్ రెహమాన్..!!

Rehman Daughter

Rehman Daughter

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమర్తె తన నిఖా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సినీరంగంలో లైవ్ సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తోన్న రియాస్ దీన్ షేక్ మొహ్మద్ తో గతేడాది డిసెంబర్ 29న నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రియాస్, ఖతీజాల షాదీ తాజాగా చాలా సింపుల్ గా జరిగింది. తన పెళ్లి ఫోటోలను ఖతీజా సోషల్ మీడియాలో షేర్ చేసింది. జీవితంలో ఇది ఎంతో సంతోషకరమైన రోజని…తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ ఖతీజా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులో రాసింది. ఏఆర్ రెహమాన్ కూడా తన కూతురు పెళ్లి ఫొటోను పోస్టు చేశాడు. ఈ జంటను భగవంతుడు దీవించాలంటూ పేర్కొన్నాడు.