APSRTC : కార్తీకమాసం సంద‌ర్భంగా ప్ర‌ముఖ శివాల‌యాల‌కు ఏపీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు

కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని శ్రీకాకుళం, పలాస, టెక్కలి డిపోల నుంచి రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలకు ఏపీఎస్‌ఆర్టీసీ

  • Written By:
  • Publish Date - November 15, 2023 / 08:06 AM IST

కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని శ్రీకాకుళం, పలాస, టెక్కలి డిపోల నుంచి రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని ఐదు ప్రముఖ శివాలయాలను కవర్‌ చేసేందుకు శ్రీకాకుళం, పలాస, టెక్కలి డిపోల నుంచి ఆదివారం, నవంబర్ 19, 26, డిసెంబర్ 3, 10 తేదీల్లో ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయని APSRTC తెలిపింది. ఆసక్తిగల యాత్రికులు శ్రీకాకుళం నుండి అందుబాటులో ఉన్న ప్రత్యేక బస్సు సర్వీసుల్లో మరిన్ని వివరాల కోసం తమ సమీప డిపోలను సంప్రదించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. ఏపీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్ www.apsrtconline.in ద్వారా సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చుని తెలిపింది. మొత్తం ట్రిప్‌కు ఒక్కో వ్యక్తికి ఛార్జీలు సూపర్ లగ్జరీకి రూ.2,400, అల్ట్రా డీలక్స్‌కు రూ.2,350, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు రూ.2,000లుగా నిర్ణ‌యించారు.