APSRTC:ఏపీలో మ‌రో బాదుడు.. భారీగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు

ఏపీలో ఇప్ప‌టికే క‌రెంట్ ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం ప‌డింది. తాజాగా ఆర్టీసీ ఛార్జీలు పెంచ‌డంతో సామాన్య ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 13, 2022 / 04:24 PM IST

ఏపీలో ఇప్ప‌టికే క‌రెంట్ ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం ప‌డింది. తాజాగా ఆర్టీసీ ఛార్జీలు పెంచ‌డంతో సామాన్య ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ ఎండీ ద్వారాక‌తిరుమ‌ల రావు నిర్ణ‌యం తీసుకున్నారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్ చార్జీలపై డీజిల్ సెస్ విధిస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. పల్లె వెలుగు బ‌స్సుల్లో కనీస ఛార్జ్ రూ .10గా నిర్ణ‌యించారు. పల్లె వెలుగు లో రూ 2 రూపాయలు..

ఎక్స్ ప్రెస్ బస్సు లో రూ 5 పెంచుతూ ఆర్టీసీ ఎండీ నిర్ణ‌యం తీసుక‌న్నారు. పెరిగిన ఛార్జీలు రేప‌టి నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. సెస్ విధింపు తో ఆర్టీసీ కి 720 కోట్ల ఆదాయం రానుంది. పెరిగిన డీజిల్ ధ‌ర‌ల‌తో ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి వచ్చిందని ఎండీ ద్వార‌కతిరుమ‌ల రావు తెలిపారు.