Telangana Govt Advisors: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను (Telangana Govt Advisors) నియమించింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరకర వేణుగోపాల్ నియామకయ్యారు.

  • Written By:
  • Updated On - January 21, 2024 / 08:48 AM IST

Telangana Govt Advisors: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను (Telangana Govt Advisors) నియమించింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరకర వేణుగోపాల్ నియామకయ్యారు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. సీఎం రేవంత్‌ రెడ్డి సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి నియామకమయ్యారు. వేం నరేందర్ రెడ్డి(సీఎం అడ్వైజర్), షబ్బీర్ అలీ(SC, ST, BC, మైనార్టీ అఫైర్స్), హర్కర వేణుగోపాల్ (ప్రొటోకాల్ పబ్లిక్ అఫైర్స్)ను ప్రభుత్వ సలహాదారులగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి నియమితులయ్యారు.

Also Read: CBN : దళితులపై నేరాలు, ఘోరాలు చేసి అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా?

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా శ్రమించి నిరాశ చెందారు. అప్పటి నుంచి కాస్త నిరుత్సాహంలో ఉన్న ఆయనకు అధిష్టానం భరోసా ఇస్తూ వచ్చింది. మరోవైపు కామారెడ్డిలో తీవ్ర పోటీ ఉండటంతో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీకి కూడా పార్టీ కీలక బాధ్యతలు ఇవ్వబోతుందని వార్తలు వచ్చాయి. వీరిద్దరితో పాటు హర్కర వేణుగోపాల్‌ కూడా సంతృప్తి చెందేలా తాజాగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించింది.

We’re now on WhatsApp. Click to Join.