Site icon HashtagU Telugu

LIC Scholarship: ఎల్ఐసి అందించే 4,80,000 స్కాలర్ షిప్ కి దరఖాస్తు చేసుకున్నారా?

Lic Scholarship

Lic Scholarship

కొంత మంది విద్యార్థులకి ప్రతిభ చాలా ఉండి అన్ని పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతూ ఉంటారు. కానీ వారి ఆర్థిక పరిస్థితి బాగోలేక ఉన్నత చదువులు చదవలేక వారి చదువులను మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. కొంత మంది విద్యార్థులకు మాత్రం తిండి, బట్టకు కూడా లోటు ఉంటుంది. ఇలాంటి సమయంలో పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ తమ చదువులు కొనసాగిస్తూ వాళ్ళ ఆశయం వైపు ముందుకు వెళ్తూ ఉంటారు.

ఇలా ఆర్థికంగా వెనకబడిన వారికి, లక్షల కొద్దీ ఫీజులను కట్టుకోలేని వారికోసం ఎల్ఐసి ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఉన్నత చదువుల కోసం చూస్తున్నట్టయితే స్కాలర్ షిప్ ని పొందవచ్చు. అయితే ఈ స్కాలర్షిప్ ని పొందడానికి ముందుగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.

LIC HFL అందించే ఈ స్కాలర్షిప్ పొందాలంటే డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి మరియు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3,60,000 లోపు ఉండాలి. భారత దేశంలో గుర్తింపు పొందిన కాలేజ్ కి లేదా యూనివర్సిటీ కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలి. గ్రాడ్యుయేషన్ లో కనీసం 60 శాతం మార్కులను కలిగి ఉండాలి. 2020 నుంచి కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకుడిని కోల్పోయిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తుంది.

ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేయడానికి డాక్యుమెట్స్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు, మార్క్స్ షీట్స్, ఆదాయ సర్టిఫికెట్, ఫారం 16ఏ, అడ్మిషన్ కి సంబందించిన బోనఫైడ్ సర్టిఫికెట్, ఐడి కార్డు, కాలేజ్ కి చెందిన ఫీజ్ రెసిప్ట్, స్కాలర్షిప్ కోసం బ్యాంకు అకౌంట్ వివరాలు,క్రైసిస్ డాక్యుమెంట్ ఉండాలి. Buddy4study వెబ్సైటు లో ఈ వివరాలు పొందుపర్చాలి. అయితే ఈ స్కాలర్షిప్ ద్వారా నెలకు 20000ల చొప్పున రెండు సంవత్సరాలకు కలిపి 4,80,000 ల స్కాలర్షిప్ లభిస్తుంది.