America: ఆపిల్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికి నిజం. ఆపిల్ వాచ్ ధరించిన వ్యక్తి ఏదైనా వాహనంలో రోడ్డు ప్రమాదానికి గురైతే ఈ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అతడి లొకేషన్ సమాచారాన్ని ఎమర్జెన్సీ సర్వీస్ కు పంపిస్తుంది. వాచ్ ధరించిన వ్యక్తి నోటిఫికేషన్ కు స్పందించని పక్షంలో, వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ కు ఆపిల్ వాచ్ నుంచి కాల్ వెళుతుంది. అమెరికాలోని విస్కాన్సిన్ లో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై బోల్తా కొట్టింది. ఇటీవల ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రగాయాలతో స్పృహతప్పి పడిపోయాడు. ఆ సమయంలో ఆపిల్ వాచ్ ధరించి ఉండడం అతడికి నిజంగా అదృష్టం అనే అనుకోవాలి.
ఆపిల్ వాచ్ లోని క్రాష్ డిటెక్షన్ ఫీచర్ యాక్టివేట్ అయి..రోడ్డు ప్రమాద సమాచారాన్ని 911 ఎమర్జెన్సీ సర్వీస్ కు చేరవేసింది. వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకుని హెలికాప్టర్ ద్వారా ఆ డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. సకాలంలో అతడిని ఆసుపత్రిలో చేర్చడంతో ప్రాణాపాయ స్థితి నుండి బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also Read: Ram Charan Tweet: ఉదయనిధికి రామ్ చరణ్ స్ట్రాంగ్ కౌంటర్, సనాతన ధర్మం మన బాధ్యత అంటూ ట్వీట్!