Apple: ఐఫోన్-4s వినియోగదారులకు చెరో రూ.1150.. ఎందుకో తెలుసా?

ఐఫోన్ -4s వినియోగదారులకు చెరో రూ.1150 (15 డాలర్లు) చొప్పున పరిహారం ఇచ్చేందుకు యాపిల్ కంపెనీ అంగీకరించింది.

  • Written By:
  • Publish Date - May 7, 2022 / 06:30 PM IST

ఐఫోన్ -4s వినియోగదారులకు చెరో రూ.1150 (15 డాలర్లు) చొప్పున పరిహారం ఇచ్చేందుకు యాపిల్ కంపెనీ అంగీకరించింది. ఈ పరిహారం ఇచ్చేందుకు కారణం 2015 నాటి ios9 అప్ డేట్. ఐఫోన్ -4s ఫోన్ల లో ఈ అప్ డేట్ చేసుకోగానే మొబైల్స్ పనితీరు ఫాస్ట్ కాకపోగా, స్లో అయిపోయింది. దీంతో ఎంతోమంది ఐఫోన్ -4s వినియోగదారులు తంటాలు పడ్డారు. అమెరికా లోని న్యూయార్క్, న్యూజెర్సీ లకు చెందిన కొందరు 2015 డిసెంబరు లో ఏకంగా కోర్టు తలుపు తట్టారు. నాటి నుంచి కొనసాగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు వినియోగదారుల వాదనతో యాపిల్ ఏకీభవించింది. ios9 వర్షన్ అప్ డేట్ చేసుకున్నాక .. ఐఫోన్ -4s ఫోన్ల పనితీరు స్లో అయిపోయి ఇబ్బందిపడ్డ వారికి నష్ట పరిహారం ఇస్తామని వెల్లడించింది. ఇలా ఇబ్బందిపడ్డ వాళ్ళు మెయిల్ ఐడీ, పేరు, ఐఫోన్ -4s సీరియల్ నంబర్ ను పంపితే తనిఖీ చేసి పరిహారం మంజూరు చేస్తామని తెలిపింది. ఈ క్లెయిమ్ ల దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.