Apple Store : ముంబై ఢిల్లీలో ఆపిల్ స్టోర్.. ఉద్యోగుల కోసం నోటిఫికేషన్

యాపిల్ సంస్థ (Apple Company) భారత్ లో తన సొంత రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేస్తోంది.

యాపిల్ సంస్థ భారత్ లో తన సొంత రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేస్తోంది. ముందుగా ముంబై, ఢిల్లీలో యాపిల్ స్టోర్లు (Apple Store) తెరుచుకోనున్నాయి. ఈ స్టోర్లలో (Apple Store) పనిచేసేందుకు ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి సారించింది. యాపిల్ ఇండియా తన అధికారిక పోర్టల్ లో జాబ్ ఓపెనింగ్స్ వివరాలను ప్రచురించింది.భారత్ లోని వివిధ ప్రాంతాల్లో పనిచేసేందుకు వీలుగా ఆసక్తి, అర్హత కలిగిన వారి నుంచి టెక్నికల్ స్పెషలిస్ట్ లు, స్టోర్ లీడర్లు, స్పెషలిస్ట్ లు, మేనేజర్లు, బిజినెస్ ఎక్స్ పర్ట్ లు, క్రియేటివ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

జీనియస్ పోస్ట్ ను కూడా ప్రకటించింది. కస్టమర్ల సాంకేతిక సమస్యలకు సమాధానం చెప్పడం యాపిల్ ఉత్పత్తులకు సంబంధించి కస్టమర్ల ఎక్స్ పీరియన్స్ ను పెంచే విధంగా వీరు సమాచారం ఇవ్వాలి వారంలో 40 గంటలు పని చేయాలని సంస్థ పేర్కొంది. రోజుకు ఎనిమిది గంటల చొప్పున అయితే 5 రోజులకు సమానం అవుతుంది. స్థానిక భాషల్లో ప్రావీణ్యంతో పాటు, ఇంగ్లిష్ ప్రావీణ్యం కూడా అవసరం. కాకపోతే ఈ ప్రకటనలో వేతన వివరాలు లేవు. ఢిల్లీలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ (Apple Store) ఏర్పాటు కానుండగా, ముంబైలో దీనికి రెట్టింపు సైజులో 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ ఉండే అవకాశం

Also Read:  Sania Mirza : టెన్నిస్ స్టార్ సానియా నికర ఆస్తులు దాదాపు రూ. 200 కోట్లు!!